నేడే ఒంటిమిట్ట కోదండ రాముడి కళ్యాణం

73చూసినవారు
నేడే ఒంటిమిట్ట కోదండ రాముడి కళ్యాణం
ఆంధ్రా భద్రాద్రిగా పేరొందిన ఒంటిమిట్ట క్షేత్రంలో ఇవాళ శ్రీ కోదండ రాముడి కళ్యాణం జరుగనుంది. ఇవాళ సా.6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు సీతారాముల కళ్యాణం వేడుకగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కోదండ రామస్వామి కళ్యాణోత్సవం కోసం టీటీడీ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. కళ్యాణ వేదికను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.

సంబంధిత పోస్ట్