సీఎం జగన్‌కు బెదిరింపు కాల్స్

62చూసినవారు
సీఎం జగన్‌కు బెదిరింపు కాల్స్
సీఎం జగన్‌పై రాళ్ల దాడి చేస్తామని కొందరు ఆకతాయిలు 1902 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. దాంతో అప్రమత్తమైన విశాఖ పోలీసులు ఐదుగురు ఆకతాయిలను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఆదివారం విశాఖలో నిర్వహించిన సీఎం జగన్ రోడ్ షోలో రాళ్ల దాడి చేస్తామని వీరు 1902కు ఫోన్ చేశారు. కాగా, ఇటీవల విజయవాడ రోడ్ షోలో సీఎం జగన్‌పై రాయి దాడి జరిగిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్