నేడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి

51చూసినవారు
నేడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి
విలక్షణ నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. విపక్షాలు సైతం కొనియాడిన వ్యక్తిత్వం ఆయనది! ‘పేదల కోసమే పాలన’ అన్నది ఆయన సిద్ధాంతం. విద్య, వైద్యం, ఉద్యోగం అందరికీ అందుబాటులోకి తెచ్చి, అసమానతలను రూపుమాపిన క్రాంతదర్శి. జన జీవితంతో ఆయన మమేకం అయ్యారు. జయాపజయాలకు అతీతంగా పాలన సాగించారు. తెలుగు నేలను సస్యశ్యామలం చేయటానికి జలయజ్ఞం తలపెట్టారు. తెలుగు ప్రజల గుండె చప్పుడుగా ఆదర్శప్రాయుడైన ప్రజా నాయకుడిగా నిలబడ్డారు. నేడు ఆయన 75వ జయంతి.

సంబంధిత పోస్ట్