నేటి రాశిఫ‌లాలు (01-06-2024)

18873చూసినవారు
నేటి రాశిఫ‌లాలు (01-06-2024)
మేషం
ప్రయాణాలు శ్రమాధిక్యత పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిరాశగా సాగుతాయి. దైవ భక్తి పెరుగుతుంది. వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆర్థికపరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలుంటాయి. ధన పరంగా కీలక నిర్ణయాలు కలిసి వస్తాయి.

వృషభం
సమాజంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. కుటుంబ విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖుల పరిచయాలు పెరుగుతాయి. బంధు మిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోమున సమస్యలు తొలగుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

మిధునం
ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. మిత్రులు మీ మాటతో విభేదిస్తారు. చేతిలో డబ్బు నిలువదు. వృధా ఖర్చులు అధికమౌతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. కుటుంబ సభ్యుల ఒత్తిడి అధికమౌతుంది ఆలయాలు సందర్శిస్తారు.

కర్కాటకం
ఒక విషయమై పెద్దలను కలుసుకుంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. దీర్ఘకాలికంగా వసూలుకాని మొండి బాకీలు వసూలు అవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి.

సింహం
సన్నిహితుల నుండి కీలకమైన సమాచారం సేకరిస్తారు. మిత్రులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ లాభం కలుగుతుంది. చిన్న ప్రయత్నంతో కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆర్ధిక లాభాలుంటాయి.

కన్య
నూతన వ్యాపార ప్రారంభమునకు అవరోధాలు కలుగుతాయి. చిన్న విషయాలకు బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. ధన వ్యవహారాలు మందగిస్తాయి. పనులలో శ్రమ అధికమౌతుంది. ప్రయాణాలలో మార్పులుంటాయి. ఉద్యోగ విషయంలో అధికారులతో సమస్యలు కలుగుతాయి.

తుల
మానసిక ప్రశాంతత కోసం దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. నిలకడలేని ఆలోచనలతో అనారోగ్య సమస్యలు కలుగుతాయి. సహాయం అందించిన సన్నిహితుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగక అసంతృప్తి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగమున అదనపు బాధ్యతలుంటాయి.

వృశ్చికం
కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. గృహమున శుభకార్యములు కొరకు ధన వ్యయం చేస్తారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వాహన లాభం కలుగుతుంది. ఉద్యోగమున కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు.

ధనస్సు
భూ సంభందిత క్రయవిక్రయాలు లాభసాటిగా ఉంటాయి. ధన ఆదాయం బాగుంటుంది. చేపట్టిన పనులలో విజయం వరిస్తుంది. పెద్దల నుండి ఆకస్మిక ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూల ఫలితాలుంటాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి.

మకరం
కొన్ని వ్యవహారాలు మధ్యలో ఆపివేస్తారు. బంధు మిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ఉద్యోగాలు కొంత అస్తవ్యస్తంగా ఉంటాయి.

కుంభం
మిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి. సంతానం విద్యా విషయాలలో ఒత్తిడి పెరుగుతుంది. ఋణ సంభందిత ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కలసిరావు. భాగస్వామ్యం వ్యాపారాలు కలసిరావు. ఉద్యోగాల్లో నిరుత్సహ వాతావరణం ఉంటుంది.

మీనం
సమాజంలో మాటకు విలువ పెరుగుతుంది. సోదరులతో ఆస్తి వివాదాలు సమస్యలు తొలగుతాయి. నూతన వ్యాపార విషయమై సన్నిహితుల సలహాలు స్వీకరిస్తారు. నూతన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార విస్తరణ పనులు వేగవంతం చేస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్