కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ చేశారు. తన విషయంలో పార్టీ పెద్దల తీరుపై జీవన్ రెడ్డి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనను బుజ్జగించే పనిలో కాంగ్రెస్ నేతలు పడ్డారు. అయితే మహేశ్ కుమార్ మాట్లాడుతుండగానే ఆయన ఫోన్ కట్ చేసినట్లు సమాచారం. కాగా, 40ఏళ్లు తాను కాంగ్రెస్ పార్టీకి చేసిన కృషికి తగిన బహుమానం ఇచ్చారని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.