భారీ వర్షంతో హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్, రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణశాఖ

56చూసినవారు
భారీ వర్షంతో హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్, రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణశాఖ
హైదరాబాద్‌లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తుండడంతో పలుచోట్ల రహదారులు జలమయమై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఐకియా కూడలి, అమీర్‌పేట, బయోడైవర్సిటీ కూడలి, గచ్చిబౌలి ప్రధాన రహదారులపై వాహనాలు బారులు తీరి ఉండడం వీడియోలో కనిపించింది. నగరంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్