AP: తల్లి కళ్లెదుటే కుమార్తెల సజీవ దహనమయ్యారు. బాపట్ల జిల్లా పర్చూరులోని రామాలయం వీధిలో రోజూ మాదిరిగానే ఆదివారం రాత్రి పిల్లలతో కలిసి ఆ తల్లి నిద్రించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆకస్మాత్తుగా ఆ ఇంట్లో మంటలు చేలరేగాయి. వెంటనే తేరుకున్న తల్లి లక్ష్మీ రాజ్యం కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు ఫైర్ సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. కదలలేని స్థితిలో మంటల్లో చిక్కుకున్న ఆ అక్కాచెల్లెళ్లు నాగమణి, మాధవిలత సజీవదహనమయ్యారు.