యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో విషాదం నెలకొంది. మూసీ నదిలో పడి బాలుడి మృతి చెందాడు. వలిగొండ వద్ద మూసీ నదిలో చేపలు పట్టేందుకు ఇద్దరు బాలురు వెళ్లారు. నీటిలో మునిగి ఒక బాలుడు మృతి చెందగా.. మరో బాలుడు గల్లంతయ్యాడు. గల్లంతైన జీవన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.