సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో విషాదం చోటుచేసుకుంది. సందీప్, కీర్తి అనే దంపతులు ఇంట్లోనే ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న వీరు కుటుంబ కలహాలతో సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.