ట్రైయినీ IAS పూజా ఖేడ్కర్ ఇంటిపైకి బుల్డోజర్

81చూసినవారు
ట్రైయినీ IAS పూజా ఖేడ్కర్ ఇంటిపైకి బుల్డోజర్
అధికార దుర్వినియోగం, UPSC కి తప్పుడు అఫిడవిట్‌ సమర్పించారన్న ఆరోపణలతో మహారాష్ట్రకు చెందిన ట్రెయినీ ఐఏఎస్‌ పూజా ఖేడ్కర్‌ వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా పుణెలోని ఆమె కుటుంబ నివాసం బయట ఉన్న అక్రమనిర్మాణాలపై పుణె మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు చేపట్టింది. ఆ ఇంటికి ఆనుకొని ఉన్న నిర్మాణాలను బుల్డోజర్‌తో కూల్చివేసింది. దీనికి సంబంధించి పీఎంసీ ఇప్పటికే నోటీసులు ఇచ్చినా ఆ కుటుంబం నుంచి ఎలాంటి స్పందనా రాలేదని అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్