ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్ జిల్లా కలెక్టర్‌గా శ్రీధర్‌ను బదిలీ చేశారు. ఆయన 2009 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గా డాక్టర్ లక్ష్మీ షాను బదిలీ చేశారు. ఆమె 2013 ఐఏఎస్ అధికారి. ఇక ఇండస్ట్రీస్ డైరెక్టర్‌గా 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అభిషిక్త కిషోర్‌కు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.