2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఆయన కొత్త పుస్తకం ‘సేవ్ అమెరికా’ కూడా హవా చూపిస్తోంది. విడుదలైన కొద్దిగంటల్లోనే అమెజాన్ బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. 92.06 డాలర్ల భారీ ధర ఉన్నప్పటికీ.. అమెజాన్‌లో ‘ప్రెసిడెంట్స్ అండ్ హెడ్స్ ఆఫ్ ది స్టేట్ బయోగ్రఫీస్’ జాబితాలో తొలిస్థానంలో నిలిచింది. ‘సేవ్ అమెరికా’లో తన తొలిపాలనకు సంబంధించిన ముఖ్య ఘట్టాలను పొందుపరిచారు.