భారత రెజ్లర్లు బజరంగ్ పునియా, వినేశ్ ఫొగాట్ లు బుధవారం కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీని కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను కాంగ్రెస్ పార్టీ 'ఎక్స్'లో పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫోటో వైరల్ అవుతోంది. అయితే హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ రెజ్లర్లు రాహుల్ గాంధీతో సమావేశమవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అంతకు ముందు, పారిస్ ఒలింపిక్స్ నుంచి తిరిగొచ్చిన తర్వాత వినేశ్ హర్యానా మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడాను కలిసిన విషయం తెలిసిందే.