చైనాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘టిక్‌టాక్’ను అమెరికాలో బ్యాన్‌పై డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. తమ దేశంలోని ఇన్వెస్టర్లు అందులో 50 శాతం వాటా పొందేందుకు అనుమతి ఇస్తే ఆ యాప్ బ్యాన్ ఎత్తివేస్తామని ప్రకటించారు. మరోవైపు, ఇదే అంశంపై బిలియనీర్ ఎలాన్ మస్క్ మాట్లాడుతూ.. అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్‌ను తాను వ్యతిరేకిస్తున్నానన్నారు. అది వాక్ స్వాతంత్య్రానికి విరుద్ధమన్నారు.