యూపీలోని కన్నౌజ్ జిల్లాలో ఇటీవల దారుణం జరిగింది. గుర్సహైగంజ్ ప్రాంతం పరిధిలోని ఉమ్మెద్‌పురా నగరంలో చెత్త పారబోసే విషయంలో రెండు కుటుంబాలకు గొడవ జరిగింది. ఈ వివాదంలో తల్లి, కుమార్తెపై పక్కింటి వ్యక్తి దాడి చేశాడు. తన వద్దనున్న పారతో తల్లి, కుమార్తెను విచక్షణా రహితంగా కొట్టాడు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు.