కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడుకి టీటీడీ ఛైర్మన్‌ లేఖ

85చూసినవారు
కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడుకి టీటీడీ ఛైర్మన్‌ లేఖ
కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడుకి టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు శనివారం లేఖ రాశారు. తిరుమల క్షేత్రాన్ని నో ఫ్లయింగ్‌ జోన్‌గా ప్రకటించాలని కోరారు. ‘‘తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలు.. ముఖ్యంగా హెలికాప్టర్లు, ఇతర వైమానిక కదలికలతో ఆలయం చుట్టూ ఉన్న పవిత్రమైన వాతావరణానికి భంగం కలుగుతోంది. నో-ఫ్లై జోన్ ప్రకటన ఒక ముఖ్యమైన అడుగు అవుతుంది” అని టిటిడి చైర్మన్ అన్నారు. ఈ లేఖపై రామ్మోహన్‌నాయుడు సానుకూలంగా స్పందించారు.

సంబంధిత పోస్ట్