ఒకే బంతికి రెండుసార్లు ఔట్.. కానీ నాటౌట్

63చూసినవారు
T20 బ్లాస్ట్లో యార్క్షైర్ బ్యాటర్ మసూద్ ఒకే బంతికి 2సార్లు ఔటైనా నాటౌట్గా నిలిచాడు. లంకాషైర్ బౌలర్ బ్లాథర్విక్ వేసిన బంతిని మసూద్ ఎదుర్కోగా అతడి కాళ్లు స్టంప్స్ను తాకి హిట్ వికెట్ అయ్యాడు. నోబాల్ కావడంతో బతికిపోయాడు. అయితే అదే బంతికి రనౌట్ కాగా అంపైర్ నాటౌటిచ్చారు. రూల్ 31.7 ప్రకారం బ్యాటర్ తాను ఔటయ్యానని పొరబడి వికెట్ వదిలేస్తే అది నాటౌట్ గా పరిగణిస్తారు. కాగా మ్యాచ్ యార్క్ షైర్ గెలిచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్