అడ్డంగా బుక్కైన ఇద్దరు చైన్ స్నాచర్లు

70చూసినవారు
అడ్డంగా బుక్కైన ఇద్దరు చైన్ స్నాచర్లు
ఓ వ్యక్తి మెడలో ఉన్న గొలుసును చోరీ చేద్దామమని యత్నించి ఇద్దరు చైన్ స్నాచర్లు అడ్డంగా బుక్కయ్యారు. ఢిల్లీ పోలీసు అయిన వినోద్ బడోలా ఒక ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్. ఈవినింగ్ వాక్ కి వెళ్లిన ఆయనపై ఇద్దరు దుండగులు దాడి చేశారు. మెడలో ఉన్న గొలుసును లాగేసి పరారయ్యారు. ఇంతలోనే తేరుకున్న ఆయన ఒకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మరొకరిని వెంబడించి పట్టుకున్నాడు. స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా వారి అసలు చరిత్ర బయటపడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్