నీట్ విషయంలో కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. ‘నీట్ వివాదంపై కాంగ్రెస్ చర్చను కోరుకోవడం లేదు. చర్చ నుంచి పారిపోవాలనుకుంటోంది. సభలో గందరగోళం సృష్టించడం మాత్రమే వారి ఉద్దేశం’ అని మండిపడ్డారు. అయితే విద్యార్థుల ప్రయోజనాలకు ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కాంగ్రెస్ లేవనెత్తిన నీట్ పరీక్ష అంశంపై రాష్ట్రపతి పార్లమెంటులో ప్రసంగించారని గుర్తు చేశారు.