మద్యం మత్తులో సెల్ఫీ దిగుతుండ‌గా నాటు ప‌డ‌వ‌ బోల్తా పడి ఇద్దరు యువకులు మృతి

1062చూసినవారు
మద్యం మత్తులో సెల్ఫీ దిగుతుండ‌గా నాటు ప‌డ‌వ‌ బోల్తా పడి ఇద్దరు యువకులు మృతి
విజయవాడ రూరల్‌ మండలం పాతపాడులో గురువారం రాత్రి ఐదుగురు స్నేహితులు మద్యం సేవించి చేపల చెరువు వద్దకు వెళ్లారు. వీరంతా నాటు పడవ ఎక్కి సెల్ఫీలు దిగుతుండగా నాటు పడవ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఇద్దరు యువకులు నీట మునిగి చనిపోగా మరో ముగ్గురిని స్థానికులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఈ ఘటనలో శివానంద్‌(23), రవికుమార్‌(21) మృతి చెందినట్టు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్