తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్కి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. అందులో డోర్ మ్యాట్లపై ఉదయనిధి స్టాలిన్ ఫోటోలు ఉన్నాయి. దీనిపై ఉదయనిధి స్పందించారు. ‘నన్ను అవమానిస్తున్నారని భావించే వీరి పట్ల నేను జాలిపడుతున్నాను. వారి రాజకీయ అపరిపక్వత బట్టబయలైంది. వారికి అంత కోపం ఉంటే నేను ద్రావిడ సూత్రాన్ని అనుసరించి సరైన మార్గంలో ఉన్నట్లే’ అని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.