ఉక్రెయిన్ సైన్యం రష్యాలోకి ప్రవేశించింది. దక్షిణ సరిహద్దుల మీదుగా తమ దేశంలోకి ప్రవేశించిన ఉక్రెయిన్ సైన్యంతో భీకర యుద్ధం చేస్తున్నట్లు రష్యా ప్రకటించింది. దక్షిణ సరిహద్దుల్లో అత్యవసర పరిస్థితి విధించినట్లు తెలిపింది. అలాగే సమీపంలోని కుర్క్స్ అణువిద్యుత్తు కేంద్రం వద్ద భద్రత పెంచినట్లు చెప్పింది. ఈ యుద్ధంలో 31 మంది పౌరులకు గాయాలైనట్లు రష్యా ఆరోగ్యశాఖ వెల్లడించింది.