భారత వృద్ధిరేటు అంచనాలను పెంచిన ఐరాస

82చూసినవారు
భారత వృద్ధిరేటు అంచనాలను పెంచిన ఐరాస
భారత ఆర్థిక వృద్ధిరేటు అంచనాలను ఐక్యరాజ్యసమితి దాదాపు 7 శాతానికి పెంచింది. ప్రభుత్వ పెట్టుబడులు, ప్రైవేటు వినిమయం పెరగడమే అందుకు కారణమని వెల్లడించింది. 2024లో భారత్ 6.9 శాతం, 2025లో 6.6 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని ఐరాస అంచనా వేసింది. బహిర్గత డిమాండ్ తక్కువగా ఉంటుందని.. దీనివల్ల సరుకుల ఎగుమతిలో వృద్ధి దెబ్బతింటుందని తెలిపింది. అదే సమయంలో ఔషధ, రసాయన ఎగుమతులు బలంగా పుంజుకుంటాయని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్