గ్రామ, సచివాలయ ఉద్యోగులకు కూటమి సర్కార్‌ షాక్‌

51చూసినవారు
గ్రామ, సచివాలయ ఉద్యోగులకు కూటమి సర్కార్‌ షాక్‌
AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సర్కార్ షాక్ ఇచ్చింది. రేషనలైజేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనాభా ఆధారంగా ఉద్యోగులను కేటాయిస్తూ.. సచివాలయాలను 3 కేటగిరీలుగా విభజించింది. ఇకపై A కేటగిరీ సచివాలయాల్లో ఆరుగురు, B కేటగిరీలో 7, C-కేటగిరీ సచివాలయాల్లో ఎనిమిది మంది సిబ్బంది ఉండనున్నారు. కాగా పలు సచివాలయాల్లో ఎక్కువ మంది, మరికొన్నిచోట్ల తక్కువ మంది ఉద్యోగులు ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్