యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS)ను ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్‌కు ముందు 12 నెలల్లో పొందిన బేసిక్ పే సగటులో 50 శాతాన్ని పింఛనుగా పొందేందుకు ఇది వీలు కల్పిస్తుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) కింద ఉంటూ, కనీసం 25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకుని యూపీఎస్‌ను ఎంచుకున్న ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది.