కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వచ్చే వారం ఈ బిల్లు పార్లమెంటు ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. అనంతరం పార్లమెంటు స్టాండింగ్ కమిటీకి పంపించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అమలులో ఉన్న దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్లు ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వెల్లడించిన విషయం తెలిసిందే.