మధ్యప్రదేశ్ శివపురి జిల్లాలోని మాధవ్ నేషనల్ పార్క్‌లో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై తేనెటీగల గుంపు దాడి చేసింది. కాగా, భద్రతా సిబ్బంది తేనెటీగల బారి నుండి సింధియాను రక్షించారు. ఈ దాడిలో ఆయన భద్రతా సిబ్బంది, మద్దతుదారులు మరియు పోలీసులు గాయపడ్డారు. పార్క్‌లో డ్రెడ్జింగ్ యంత్రాన్ని ప్రారంభించేందుకు వచ్చిన సింధియా తేనెటీగల దాడి కారణంగా ప్రారంభోత్సవం చేయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.