యూపీ మదర్సా చట్టం రాజ్యాంగ విరుద్ధం: హైకోర్టు

55చూసినవారు
యూపీ మదర్సా చట్టం రాజ్యాంగ విరుద్ధం: హైకోర్టు
యూపీ మదర్సా చట్టం(2004) రాజ్యాంగ విరుద్ధమని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. మదర్సా బోర్డు అధికారాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై వాదోపవాదాల అనంతరం తాజాగా కోర్టు తీర్పునిచ్చింది. ఈ చట్టం లౌకికవాదానికి విరుద్ధమని, మదర్సాల్లో చదివే పిల్లల్ని గుర్తింపు పొందిన ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని పేర్కొంది. అందుకు తగిన చర్యల్ని ప్రభుత్వం తీసుకోవాలని, అవసరమైతే పాఠశాలల్లో సీట్ల సంఖ్యను పెంచాలని ఆదేశించింది.

సంబంధిత పోస్ట్