యూపీఐ పేమెంట్లకు ఎనలేని ఆదరణ

73చూసినవారు
యూపీఐ పేమెంట్లకు ఎనలేని ఆదరణ
దేశవ్యాప్తంగా యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) పేమెంట్లకు ఎనలేని ఆదరణ పెరుగుతోంది. ప్రతి నెలా ఏకంగా 60 లక్షల మంది నూతన వినియోగదారులు యూపీఐ చెల్లింపులు మొదలుపెడుతున్నారని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) డేటా పేర్కొంది. ఈ ఏడాది ప్రాతిపదికన యూపీఐ లావాదేవీల సంఖ్య ఏకంగా 49 శాతం మేర పెరిగి 13.9 బిలియన్లకు చేరిందని తెలిపింది. ఇక లావాదేవీల విలువ రూ.20.1 లక్షల కోట్లకు చేరిందని ప్రకటించింది.

సంబంధిత పోస్ట్