మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌లో నేర కార్యకలాపాలను ప్రోత్సహించారనే ఆరోపణలపై అరెస్ట్ అయిన ఆ సంస్థ సీఈఓ పావెల్ దురోవ్ కేసులో ఫ్రాన్స్ కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. దేశం విడిచి వెళ్లకుండా అతనిపై నిషేధం విధించింది. అలాగే ఐదు మిలియన్ యూరోల పూచీకత్తుపై కండిషనల్ బెయిల్ జారీ చేసింది. వారానికి రెండు సార్లు పోలీస్ స్టేషన్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించింది.