యుద్ధాన్ని ముగించేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రతిపాదించిన ప్రణాళికను రష్యా తిరస్కరించింది. ఉక్రెయిన్ తో పోరాడుతూనే ఉంటామని ఈ మేరకు స్పష్టం చేసింది. "ఉక్రెయిన్ నేతల నుంచి ఇలాంటి ప్రకటనలు వినడం ఇది మొదటిసారేం కాదు. మేం మా ప్రత్యేక సైనిక చర్యను కొనసాగిస్తున్నాం. మేం అనుకున్న లక్ష్యాలన్నింటినీ సాధిస్తాం" అని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ చెప్పారు.