దేశంలోని 234 నగరాలు/పట్టణాల్లో ప్రైవేట్ ఎప్ఎం రేడియోను కేంద్రం అందుబాటులోకి తీసుకురానుంది. రూ.784.87 కోట్ల రిజర్వ్ ప్రైస్‌తో 730 ఛానళ్లకు ఈ-ఆక్షన్ నిర్వహించనుంది. ఈ క్రమంలో ఏపీలో మొత్తం 22 నగరాల్లో 68, తెలంగాణలో 10 నగరాల్లో 31 ఎఫ్ఎం రేడియో స్టేషన్లు కొత్తగా అందుబాటులోకి రానున్నాయి. దీంతో మాతృభాషలో స్థానిక కంటెంట్ పెంచేందుకు, అలాగే కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు అవకాశం కలుగుతుందని భావిస్తున్నారు.