అమెరికాలో దోమకాటుతో వైరస్.. పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్!

68చూసినవారు
అమెరికాలో దోమకాటుతో వైరస్.. పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్!
అమెరికాలో దోమ కాటు కారణంగా 'ఈస్టర్న్ ఈక్విన్ ఎన్సెఫాలిటిస్' అనే వైరస్ సోకి ఓ వ్యక్తి మృతి చెందడంతో ఆ దేశ యంత్రాంగం అప్రమత్తమైంది. మసాచుసెట్స్, వెర్మాంట్ తదితర ప్రాంతాల్లో అనధికార లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. పార్కులు, బహిరంగ కార్యక్రమాలపై నిషేధం విధించారు. దీంతో హెలికాప్టర్ల ద్వారా మందులు పిచికారీ చేస్తున్నారు. ఈ వైరస్ సోకిన వారిలో జ్వరం, విరేచనాలు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్ కి వ్యాక్సిన్ లేదని సమాచారం.

సంబంధిత పోస్ట్