ఏపీలో సెప్టెంబర్ 1న పంపిణీ చేయాల్సిన సామాజిక పింఛన్లను ఆ రోజు ఆదివారం కావడంతో ఒక రోజు ముందే ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. రాబోయే రోజుల్లోనూ నెలలో మొదటి దినం సెలవు రోజైతే.. ఒక రోజు ముందే పింఛన్లు పంపిణీ చేస్తారు. ఈ నెల 31న జరిగే పింఛన్ల పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు.