గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల బదిలీలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. షెడ్యూల్ ప్రకారం నిన్నటితోనే ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా పింఛన్ల పంపిణీ నేపథ్యంలో వారిని రిలీవ్ చేయొద్దని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. కొన్ని శాఖలకు బదిలీ ప్రక్రియ మినహాయింపు ఇవ్వగా తదుపరి ఉత్తర్వులు వచ్చాకే ట్రాన్స్ఫర్ చేయాలని కలెక్టర్లను సూచించింది.