వరలక్ష్మీ వ్రతం పూజా విధానం

82చూసినవారు
వరలక్ష్మీ వ్రతం పూజా విధానం
వరలక్ష్మి దేవి పూజ కోసం ముందుగా బలిపీఠం ఏర్పాటు చేసుకుని.. దానిపై బియ్యపుపిండితో ముగ్గు వేసుకొని పువ్వులతో అలంకరించుకోవాలి. ఆ పీఠంపై కలశాన్ని ఏర్పాటు చేసుకొని వరలక్ష్మీ దేవి ప్రతిమను లేదా కలశం మీద కొబ్బరికాయను ఉంచి రవిక గుడ్డ పెట్టి పసుపు, కుంకుమ రాశి అమ్మవారి రూపాన్ని చేసుకోవచ్చు. అమ్మవారిని ఆవాహనం చేస్తూ షోడశోపచారాలతో పూజ చేయాలి. అష్టోత్తర శతనామావళి, కనకధారా స్తోత్రం పఠించాలి. అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించి.. వరలక్ష్మి వ్రత కథను చదువుకోవాలి.

సంబంధిత పోస్ట్