వీగన్స్.. ఈ విషయంలో జాగ్రత్త

71చూసినవారు
వీగన్స్.. ఈ విషయంలో జాగ్రత్త
మాంసాహారంతో పాటు పాల పదార్థాలూ తినని వారిని వీగన్స్ అంటారు. అయితే వీగన్స్ లో బాడీమాస్ ఇండెక్స్ తగ్గుతోందని.. దీంతో ఎముకలు విరిగే ప్రమాదం ఎక్కువని శాస్త్రవేత్తలు తెలిపారు. కాల్షియం స్థాయులు తగ్గడమే ఇందుకు కారణమంటున్నారు. మాంసాహారులతో పోలిస్తే వీరిలో ఎముకలు దృఢంగా ఉండబోవని, ఫ్యాక్చర్స్ అయ్యే ప్రమాదం ఎక్కువని తేలింది. కాబట్టి వీగన్స్ బాడీలో జరిగే మార్పుల్ని పరిశీలించుకుంటూ ఉండాలని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్