‘కల్కి’ టీమ్‌కు థ్యాంక్స్‌ చెప్పిన వర్మ

57చూసినవారు
‘కల్కి’ టీమ్‌కు థ్యాంక్స్‌ చెప్పిన వర్మ
దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ‘కల్కి 2898 ఏడీ’తో తెరంగేట్రం చేశారు. ఆ మూవీలో ఆర్జీవీని చూసిన వారంతా సర్‌ప్రైజ్‌ అయ్యారు. తనకు అవకాశం ఇచ్చిన ‘కల్కి’ టీమ్‌కు థ్యాంక్స్‌ చెప్పారు. దర్శకుడు, నటులను ప్రశంసించారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. ‘‘నాగ్‌ అశ్విన్‌. మీ ఆశయం, ఊహ అద్భుతం. అమితాబ్‌ బచ్చన్‌ గతంలో కంటే 100 రెట్లు డైనమిక్‌గా కనిపించారు. ప్రభాస్‌ కొత్త అవతార్‌ అదుర్స్‌. నన్ను నటుడిగా పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్