నేడు పోలవరంపై శ్వేతపత్రం విడుదల

85చూసినవారు
నేడు పోలవరంపై శ్వేతపత్రం విడుదల
పోలవరం ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం శుక్రవారం శ్వేతపత్రం విడుదల చేయనుంది. ప్రాజెక్టు నిర్మాణ స్థితిగతులపై వాస్తవాలను ప్రభుత్వం వివరించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు అమరావతి సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. కాగా, కేంద్రం నియమించిన అంతర్జాతీయ నిపుణుల బృందం శనివారం పోలవరం పరిశీలనకు రానుంది. దీనిపై నివేదికను రూపొందించనుంది. దీని ప్రకారం ప్రభుత్వం పనులు చేపట్టనుంది.

సంబంధిత పోస్ట్