భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్‌పై అనర్హత వేటు పడింది. ఉండాల్సిన బరువు కన్నా 100 గ్రాములు అధిక బరువు ఉండడంతో ఆమెను అనర్హులిగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తెలిపింది. ఈ ఘటన దేశానికి చాలా బాధాకరం అని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్‌ఐ) ప్రెసిడెంట్ సంజయ్ సింగ్ అన్నారు. వినేశ్ అనర్హత వేటుపై ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘మాకు తక్కువ సమయం ఉంది. కానీ మేము చేయగలిగినదంతా చేస్తామని అన్నారు.