సీఎం రేవంత్‌ ను కలిసిన వీహెచ్‌

586చూసినవారు
సీఎం రేవంత్‌ ను కలిసిన వీహెచ్‌
కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. వీహెచ్‌ను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ రేవంత్‌ వద్దకు తీసుకెళ్లారు. పార్లమెంట్ టికెట్ తనకు ఇచ్చే అవకాశం లేదని అలకబూనిన వీహెచ్.. గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల మీడియా ముందు వీహెచ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో వీహెచ్ కు అన్ని విధాలా అండగా ఉంటామని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్