VIDEO: ముంబై రైల్వే స్టేషన్‌ బయట యువకుడిని బెల్టులతో దారుణంగా కొట్టిన ఆటో డ్రైవర్లు

84చూసినవారు
ముంబైలోని మాన్‌ఖుర్ద్ రైల్వే స్టేషన్ ఇటీవల షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్ వెలుపల ఉన్న ఆటో-రిక్షా స్టాండ్ వద్ద ఒక యువకుడిని చిన్న వివాదం కారణంగా ఆటోడ్రైవర్లు ఘోరంగా కొట్టారు. కొట్టవద్దు అని ఎంత ప్రాధేయపడినా వదల్లేదు. ఆటో డ్రైవర్లు యువకుడిని బెల్టులతో కొట్టడం, పదే పదే చెప్పుతో కొట్టడం మీరు ఈ వీడియోలో చూడవచ్చు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో స్థానిక పోలీసులు ముగ్గురు ఆటోడ్రైవర్లను అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్