AP: రాష్ట్రంలోని సైబర్ బాధితులకు డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా భారీ ఊరటనిచ్చే న్యూస్ చెప్పారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, మోసపోకుండా సలహాలు, ముందుజాగ్రత్త చర్యలు సూచించేందుకు ప్రత్యేక యాప్ తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.సైబర్ దర్యాప్తు విభాగాన్ని 30 రోజుల్లో అందుబాటులోకి తెస్తామని అన్నారు. ప్రతి జిల్లాలో ఒక సైబర్ పోలీసుస్టేషన్ ఏర్పాటు చేస్తామని డీజీపీ తెలిపారు.