రాజస్థాన్‌లోని జలోర్‌లో ఇటీవల షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన బుల్లెట్ బండికి పెట్రోల్ నింపుకోవడానికి బంకుకి వెళ్ళాడు. అక్కడి పంప్ బాయ్ పెట్రోల్ నింపాడు. అనంతరం బైకర్ బుల్లెట్ బండిని షేక్ చేశాడు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే సిబ్బంది అప్రమత్తమై ఫైర్ ఎక్స్‌టింగ్విషర్‌లను ఉపయోగించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.