VIDEO:యువకుడి ప్రాణం కాపాడిన ఫ్రెండ్స్

80చూసినవారు
కొందరు స్నేహం కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడతారు. స్నేహానికి వారిచ్చే విలువ అలాంటిది. దీనిని చాటేలా ఓ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో మంగళవారం జరిగింది. ఓ యువకుడు నదిలో స్నానం చేస్తూ కొట్టుకుపోయాడు. అయితే ఆ యువకుడిని కాపాడాలని స్నేహితులు నిర్ణయించుకున్నారు. అందరూ ఒకరి చేయి మరొకరికి అందించి, నదిలో కొట్టుకుపోతున్న యువకుడిని అతికష్టం మీద రక్షించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్