ప్రియురాలిపై యువకుడు దాడి (వీడియో)

67చూసినవారు
యూపీలోని ఝాన్సీలో మంగళవారం దారుణం జరిగింది. నవాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిచోర్ ప్రాంతంలో ఓ యువకుడు తన ప్రియురాలిపై దాడి చేశాడు. రోడ్డుపైనే ఆమెను జుట్టు పట్టుకుని లాగాడు. అంతేకాకుండా తన మోచేతితో ఆమె వీపుపై కొట్టాడు. అక్కడే ఉన్న పలువురు ఈ ఘటనను చూస్తూ ఉండిపోయారు. ఏ ఒక్కరూ ఆ యువకుడిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్