పారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం దక్కింది. స్ప్రింటర్ ప్రీతి పాల్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. మహిళల 100మీ. టీ35 విభాగం ఫైనల్‌లో ఆమె మూడో స్థానం దక్కించుకుంది. 14.21 సెకన్లలో తన రేసును ముగించారు. చైనాకు చెందిన అథ్లెట్లు తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ప్రీతిపాల్.. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఒక రైతు కుటుంబంలో జన్మించింది. ఆమె పుట్టినప్పుడే శారీరక సమస్యలు ఎదుర్కొంది. కాళ్లలో సత్తువ కోసం పలు చికిత్సలు చేయించుకుంటోంది.