శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ-సీ59 నింగిలోకి దూసుకెళ్లింది. యురోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3లోని రెండు ఉపగ్రహాలను ISRO కక్ష్యలో ఈ రాకెట్ ప్రవేశపెట్టనుంది. బుధవారమే ఈ ప్రయోగం నిర్వహించాల్సి ఉండగా.. వ్యోమనౌకలో సాంకేతిక సమస్యతో నేటికి వాయిదా పడిన విషయం తెలిసిందే.