దాదాపు మూడు దశాబ్దాల నాటి మోసం కేసులో మహారాష్ట్ర వ్యవసాయ మంత్రి మాణిక్‌రావ్ కోకాటే, ఆయన సోదరుడికి రెండేళ్ల జైలు శిక్ష విధించబడింది. నాసిక్ జిల్లా కోర్టు వారిద్దరికీ రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.50,000 జరిమానా కూడా విధిస్తూ గురువారం తీర్పునిచ్చింది. 1997లో పత్రాలను తారుమారు చేయడం, మోసం చేయడం వంటి ఆరోపణలపై మాణిక్‌రావు మరియు ఆయన సోదరుడు విజయ్ కోకాటేపై నమోదైన కేసులో ఈ తీర్పు వెలువడింది.