అక్షర్ పటేల్‌కు 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో హ్యాట్రిక్ సాధించిన తొలి భారత బౌలర్‌గా నిలిచే అవకాశం త్రుటిలో చేజారింది. 9వ ఓవర్‌లో అక్షర్ వరుసగా తంజిద్ హసన్, ముష్ఫికర్ రహీమ్‌లను ఔట్ చేశాడు. ఆ తర్వాత బంతికి బంగ్లాదేశ్ బ్యాటర్ జాకీర్ అలీ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను స్లిప్స్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ పట్టుకోలేకపోయాడు. గ్రౌండ్‌పై చేతితో కొడుతూ రోహిత్ తన నిరాశను వ్యక్తపరిచాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.